Home Page Slider

వందరోజులకు పరుగుపెడుతున్న “వాల్తేర్ వీరయ్య”

మెగాస్టార్ చిరంజీవి హుషారుగా నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రం శతదినోత్సవం జరుపుకోబోతోంది. ఈ ఫంక్షన్‌ను ఏప్రిల్ 22న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గ్రాండ్‌గా చేయబోతున్నామని చిత్రయూనిట్ తెలిపింది. ఈమేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అయ్యింది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లరూపాయలు వసూళ్లు చేసి రికార్డు సాధించింది.