Andhra PradeshBreaking NewsHome Page SliderSpiritual

వైకుంఠ ఏకాద‌శి టికెట్లు జారీ ఈ నెల 23న‌

వ‌చ్చే ఏడాది జనవరి 10న వైకుంఠ ఏకాదశి పుర‌స్క‌రించుకుని ఈ నెల 23న సంబంధిత టికెట్లు జారీ చేయ‌నున్న‌ట్లు టిటిడి ప్ర‌క‌టించింది. జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠద్వార దర్శనం ద్వారా భ‌క్తుల‌కు స్వామి వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు.అదేవిధంగా ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తామ‌ని తెలిపింది.ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.3000ల‌ ప్రత్యేక దర్శన టికెట్స్ ను విడుదల చేయ‌నున్న‌ట్లు పేర్కొంది.