చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
కదిరి: కదిరి నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. తలుపుల, గాండ్లపెంట, ఎన్పీకుంట మండలాలతో పాటు నల్లచెరువుకు చెందిన వైకాపా, బీజేపీ నాయకులు బుధవారం రాత్రి తెదేపా బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడకు నాలుగు బస్సుల్లో వెళ్లిన విషయం తెలిసిందే. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం చంద్రబాబు వైకాపా నాయకులను పసుపు కండువాలతో పార్టీలో చేర్చుకున్నారు.

