ఐపీఎల్‌లో వైభవ్ వయసు కలకలం
కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో రూ.1.10 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ వయసుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడిని ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి మరీ రాజస్థాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. అయితే అతని వయసు 15 ఏళ్లని ఆరోపణలు వస్తూండడంతో అతని తండ్రి స్పందించాడు. వైభవ్‌కు 8 ఏళ్ల వయసులోనే బీసీసీఐ ఎముక పరీక్ష చేసి, వయసు నిర్థారించిందని, మరోసారి పరీక్షకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. అతను ఇప్పటికే అండర్-16, అండర్-19లకు ఆడారని, అద్భుతంగా రాణించాడని పేర్కొన్నారు. 12 ఏళ్లకే ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన వైభవ్ 5 మ్యాచ్‌లలో సెంచరీలు సాధించారు.
BREAKING NEWS: ఢిల్లీలో పవన్ కల్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ