అండర్ 19 టీమిండియాలో చిచ్చరపిడుగు ఎంట్రీ..
టీమిండియా అండర్ 19 టీమ్‌లోకి రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. ఇంగ్లండ్‌లో జరగబోయే అండర్ 19 ఒన్ డే ఇంటర్నేషనల్ టీమ్ కోసం బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. జూన్ 24 నుండి ఈ టీమ్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. వీరితో పాటు ఈ టీమ్‌లో విహాన్, మౌల్యరాజ్ సింగ్, రాహుల్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్, అంబరీష్, కనిష్క్, ఖిలాన్, హెనిల్, ప్రణవ్, ఈనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్‌లకు కూడా చోటు దక్కింది.