Home Page SliderNational

ప్రభుత్వ బంగళా ఖాళీ చేయండి.. రాహుల్ గాంధీకి నోటీసులు

లోక్ సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసు ఇచ్చింది. గుజరాత్‌లో సూరత్ కోర్టు తీర్పు తర్వాత రెండేళ్ల జైలు శిక్ష పడటంతో… కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. రాహుల్ గాంధీకి 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఢిల్లీలోని లుటియన్స్‌లో 12 తుగ్లక్ లేన్‌లో బంగళా ఇచ్చారు. తుగ్లక్ లేన్ బంగ్లాలో రాహుల్ గాంధీ 12 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. నెల రోజుల్లోగా ఇప్పుడు ఉంటున్న ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు పేర్కొంది. ఐతే రాహుల్ గాంధీకి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తున్నందున ఆయనకు నివాస బాధ్యత కేంద్రానిదే అన్న అభిప్రాయం కూడా నిపుణుల్లో ఉంది.