Home Page SliderTelangana

హుజూర్ నగర్‌లో ఉత్తమ్ మెజార్టీ 46,748

హుజూర్ నగర్ ‌లో కాంగ్రెస్ ముఖ్యనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి 46,748 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజకీయంగా ఓటమి ఎరుగని మగధీరుడిలా ఉన్న ఉత్తమ్ ఇప్పటి వరకు తాను పోటీ చేసిన అన్ని చోట్లా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిపై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి హాట్రిక్ విజయాలు నమోదు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఉత్తమ్ దంపతులకు అటు కోదాడ, ఇటు హుజూర్‌నగర్‌లో ఆదరణ ఉంది. వెల్లటూరు లిఫ్ట్ ఇరిగేషన్, మెట్ పల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. హుజూర్ నగర్ టౌన్ మొత్తం డబుల్ రోడ్స్ నిర్మాణం జరిపారు. మెట్ పల్లి నుంచి హుజూర్ నగర్ వరకు కృష్ణా జలాలలను తీసుకొచ్చారు. టౌన్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మింపజేశారు. ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచారు. పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు.