ఎస్సీ వర్గీకరణ తొలి ప్రతిని రేవంత్ కి ఇచ్చిన ఉత్తమ్
ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో తొలి ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు మంత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ ను అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణాని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమకుమార్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభల్లో అన్ని పక్షాలు మాట్లాడాయి. ఏ పార్టీ కూడా వర్గీకరణ ఆంశంపై ఒక్క అడుగు ముందుకువేయలేదు. వర్గీకరణపై మా సర్కార్ ఏర్పాడ్డాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ అధ్యాయనం చేసింది. దళితుల్లో సామాజిక,ఆర్ధిక వ్యత్యాసాలు ఉండకూడదని మంత్రులు తెలిపారు. విద్య , ఉద్యోగాల్లో ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. ఇక నుంచి ప్రభుత్వం భారీ స్ధాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని నిరుద్యోగులకు శుభవార్తని మంత్రులు చెప్పారు.