Home Page SliderInternational

ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలో ఉద్యోగాల కోత:అమెరికా

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్‌ యంత్రాంగం భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇందులోభాగంగా యూఎస్‌ ప్రభుత్వం తాజాగా సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలో సంస్కరణలకు సిద్ధమైంది. ఏజెన్సీలోని 1200 మంది ఉద్యోగులను తొలగించడానికి కసరత్తు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదే పంథాలో మరికొన్ని ఏజెన్సీలలోనూ వేలాది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని వెల్లడించాయి. అయితే ఈ నివేదికలపై సీఐఏ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో స్పందించాల్సి ఉంది.