సెప్టెంబర్‌లో ఇండియాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానున్నారు. 2023 అమెరికా-ఇండియా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే ఏడాది అంటూ అమెరికా ముఖ్య నాయకుడు ఈ విషయాన్ని వెల్లడించారు. జీ 20 సమావేశాల నిర్వహణ ద్వారా భారతదేశం ప్రపంచానికి ఇండియా స్థానాన్ని తెలియజేసిందన్న అభిప్రాయంలో అమెరికా ఉంది. సౌత్, సెంట్రల్ ఆసియా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డోనాల్డ్ లు , బైడెన్ ఇండియా పర్యటన విషయాన్ని వెల్లడించారు. జీ 20 సమావేశాలను ఇండియా నిర్వహిస్తోందని, ఈ ఏడాది అమెరికా ఎపెక్ సదస్సుకు నాయకత్వం వహిస్తోందని, జీ 7 సదస్సును జపాన్ నేతృత్వం వహిస్తోందని… . ఈ ఏడాది చాలా కీలకమైన సంవత్సరమని ఆయన చెప్పారు. ఈ సమావేశాలు దేశాలన్నింటినీ ఏకం చేస్తాయన్నారు. సెప్టెంబర్‌లో ఇండియా వచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమవుతున్నారని.. జీ 20 నేతల సమవేశాల్లో భాగంగా ఆయన రానున్నారని ఆయన తెలిపారు. వచ్చే రోజుల్లో కీలక అంశాలపై ఎలాంటి నిర్ణయం రాబోతుందని ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది కీలక ఘట్టాలకు వేదికవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
