Home Page SliderInternational

ఉక్రెయిన్‌‌లో ఆకస్మిక పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

ఒక్కసారి దాడి చేస్తే… ఉక్రెయిన్ పనైపోతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలోచనలు తప్పని రుజువయ్యాయన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఫిబ్రవరి 24, 2022న రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగాక… ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడి మొదటిసారి వచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని బైడెన్ కలిసినప్పుడు రాజధాని అంతటా వైమానిక సైరన్‌లు మోగించారు. యుద్ధం తీరును పర్యవేక్షించేందుకు వచ్చిన బైడెన్… ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు తెలిపారు. యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మరిన్ని ఆయుధాల అందిస్తామని హామీ ఇచ్చారు. యూనిఫాం ధరించిన ఉక్రెయిన్ సైనిక అధికారులు బయట వీధిలో పహారాగా నిలిచారు. బైడెన్, జెలెన్‌స్కీ నడుచుకుంటూ వెళ్లి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వీరుల కోసం వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ గోడపై ఒక పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. ఈ సందర్భంగా రష్యా దాడి సందర్భంగా ఉక్రెయిన్‌ను ఒంటరిగా వదలడం లేదని… ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను రక్షించడంలో వాషింగ్టన్ పూర్తి అండగా ఉంటుందన్నాడు.

ఉక్రెయిన్ ప్రజలను వైమానిక బాంబు దాడుల నుండి రక్షించడంలో సహాయపడటానికి మందుగుండు సామగ్రి, యాంటీ-ఆర్మర్ సిస్టమ్స్, ఎయిర్ సర్వైలెన్స్ రాడార్‌లతో సహా కీలకమైన పరికరాలను ప్రకటిస్తామని చెప్పాడు. యూరోపియన్ యూనియన్ రక్షణ పరిశ్రమ ప్రస్తుతం ఉత్పత్తి చేయగలిగిన దానికంటే ప్రతి నెలా వేల సంఖ్యలో షెల్స్‌ను అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడి సందర్శనతో తమకు ప్రపంచం మద్దతు ఉందని రుజవయ్యిందన్నారు జలెన్‌స్కీ. బైడెన్ ఉక్రెయిన్‌కు రావడం ద్వారా మా ప్రజలకు ధైర్యాన్నిచ్చారని… శుభసంకేతమన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో సహాయం చేయడానికి రష్యాకు ఆయుధాలను పంపాలని చైనా పరిశీలిస్తోందన్న అమెరికా వాదనలకు వ్యతిరేకంగా బీజింగ్ విరుచుకుపడటంతో ఈ పర్యటన జరిగింది. యుద్ధభూమికి అనంతంగా ఆయుధాలను రవాణా చేస్తున్నది అమెరికా అని, చైనా కాదన్నారు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. EU విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ కూడా ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యాకు ఆయుధాలను అందించడానికి వ్యతిరేకంగా చైనాను హెచ్చరించాడు.