అదానీ కేసుపై అమెరికా ప్రభుత్వం క్లారిటీ..
భారత్ బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికా ఎందుకు కేసు పెట్టింది. అదానీ భారత్‌లో లంచాల సొమ్ము ఇవ్వడానికి, అమెరికాకు ఏం సంబంధం ఈ విషయాలపై అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విషయమేమిటంటే, గౌతమ్ అదానీ, అతని బంధువులు సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2 వేల కోట్లకు పైగా లంచాలు ఇచ్చారని, ఆ సొమ్ము ఇవ్వడానికి తప్పుడు సమాచారం ద్వారా అమెరికాలో నిధులు సేకరించారని కేసు పెట్టారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనం (వైట్ హౌస్) క్లారిటీ ఇచ్చింది. అదానీపై కేసు విషయంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, న్యాయశాఖలు సరైన సమాచారం ఇస్తారని, దీనివల్ల భారత్, అమెరికాల మధ్య సంబంధాల విషయంలో ఎలాంటి తేడాలు రావని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం ఉందని పేర్కొన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి విద్యుత్ కొనుగోలు విషయంలో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.