Home Page SliderTelanganaTrending Today

అఖిల్ ఏజెంట్‌లో ‘ఊర్వశిరౌతాలా’ హాట్ సాంగ్

అఖిల్ ‘రాఏజెంట్‌’గా వస్తున్న ఏజెంట్ సినిమాలో బాలీవుడ్ భామ ‘ఊర్వశిరౌతాలా’ స్పెషల్ ఐటెమ్ సాంగ్‌ను ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ నెల 28న రిలీజ్ కాబోతున్న ఏజెంట్ మూవీ ట్రైలర్స్, ప్రమోషన్ష్‌తో ఇప్పటికే అక్కినేని అభిమానుల్లో జోష్ నింపింది. ఊర్వశి రౌతాలా స్పెషల్ సాంగ్‌ను ఈ సందర్భంగా విడుదల చేసారు. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘వేర్‌ ఈజ్ ద పార్టీ’ అంటూ మెగాస్టార్ చిరంజీవితో ఆడిపాడిన ఊర్వశి సాంగ్ భారీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఏజెంట్‌తో ‘వైల్డ్ సాలా’ అంటూ సాగే ఈ పాట ఎలా ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.