Home Page SlidermoviesNational

బాలకృష్ణతో పాటపై ఊర్వశి రౌతేలా కామెంట్స్

సంక్రాంతికి విడుదలైన చిత్రం “డాకు మహారాజ్‌”లో బాలకృష్ణతో కలిసి చేసిన డ్యాన్స్‌పై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కీలక కామెంట్స్ చేశారు. చిత్రంలోని ‘దబిడి దిబిడి’ అంటూ సాగే ఈ పాట  విడుదలైనప్పటి నుండి  కొరియోగ్రఫీపై విమర్శలను ఎదుర్కొంటోంది, చాలా మంది ప్రేక్షకులు దీనిని “అసభ్యకరమైందిగా” కితాబు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఊర్వశి మాట్లాడుతూ “విజయం అనివార్యంగా వస్తుంటుంది విమర్శలను అంతగా పట్టించుకోవలసిన పనిలేదు. పెర్‌ఫార్మెన్స్‌తో వచ్చే గుర్తింపును నేను గౌరవిస్తాను. డాన్స్ కళలో ఒక భాగం, బాలకృష్ణలాంటి సీనియర్ హీరోతో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.