లండన్‌కు పాకిస్తాన్ నుండి యురేనియం పార్సిల్
రేడియోధార్మిక యురేనియం పార్సిల్ పాకిస్తాన్ నుండి లండన్‌కు రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. యురేనియంను న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, రియాక్టర్లలో వాడతారు. అణు బాంబుల తయారీలో వాడతారు. లండన్‌లోని హీథ్రో విమానాశ్రయంలో ఈ పేలుడు పదార్థాన్ని అధికారులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ ముండి కార్గోలో వచ్చిన్నట్లు బ్రిటన్ పత్రికలు వెల్లడిస్తున్నాయి. దీనిలో కొన్ని కిలోల రేడియోధార్మిక యురేనియం ఉన్నట్లు కనిపెట్టారు.

పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ విమానం మస్కట్‌లో ఆగి, బ్రిటన్ చేరుకుంది. ఇది డిసెంబర్ 29 న హీథ్రో ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒమన్ ఎయిర్ ప్యాసింజర్. దీనిలో లోహపు కడ్డీల మధ్యలో యురేనియం పెట్టి పంపినట్లుగా తనిఖీలలో తేలింది. లండన్‌లోని ఇరాన్ వ్యాపారవేత్త నిర్వహిస్తున్న కార్యాలయానికి ఈ పార్సిల్ వచ్చిందట. దీనిని గుర్తించిన వెంటనే అధికారులు నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. తర్వాత కౌంటర్ టెర్రరిజం అధికారులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ విషయాలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ పార్సిల్ గురించి మాకు బ్రిటన్ నుండి సమాచారం రాలేదని, అసలు అలాంటి ప్యాకేజి ఏదీ కరాచీ నుండి వెళ్లలేదని పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా పేర్కొన్నారు.