ఉప్పల్ వరుడు..కెనడా వధువు ఒక్కటైన వేళ
ఈ ప్రపంచంలో ప్రేమ చాలా గొప్పదని ,దానికి ఎటువంటి హద్దులు లేవని మనం చాలా కవితల్లో చదివే ఉంటాం. ఈ మేరకు దేశ హద్దులను దాటి ఒక ప్రేమ విరబూసింది. విరబూసిన ప్రేమ పెద్దల అంగీకారంతో ఫలించి పెళ్లి పీటలెక్కింది. ఇటువంటి అద్భుత సంఘటన ఉప్పల్‌లో చోటు చేసుకుంది. ఉప్పల్‌కి చెందిన రోహిత్ ,కెనడాకు చెందిన కియర్ర గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలను ఒప్పించి,హిందూ సాంప్రదాయం ప్రకారం మల్లాపూర్‌లోని ఓ కళ్యాణ మండపంలో పెళ్ళి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎంఎస్ చేయడానికి రోహిత్ కెనడా వెళ్ళాడు. ఎంఎస్ పూర్తయిన అనంతరం అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డాడు. రోహిత్ పనిచేసే సంస్థలో కియర్ర తండ్రి జేసన్ క్లబ్ పనిచేస్తుంటాడు. రోహిత్‌కు జేసన్‌తో ఏర్పడిన పరిచయం కారణంగా కియర్ర ఇంట్లో జరిగే శుభకార్యాలకు రోహిత్ హాజరయ్యేవాడు. దీంతో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఒక్కటైన నూతన వధూవరులు రోహిత్,కియర్రలను మాజీ ఎమ్మేల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆశీర్వదించారు.