Home Page SliderInternational

అట్టహాసంగా దుబాయ్‌లో మెగా కోడలు ఉపాసన సీమంతం

మెగాఫ్యామిలీ శుభవార్తల వర్షంలో తడిసి ముద్దవుతోంది. తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల తన పుట్టింటి వారు ఏర్పాటు చేసిన దుబాయ్‌లో జరిగిన  సీమంతం ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకుని ప్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్న రామ్‌చరణ్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. తన భార్యను చూసి మురిసిపోయాడు.

తనను గ్లోబల్ స్టార్‌గా మార్చిన RRR మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో పాటు, పెళ్లయిన పదేళ్ల తర్వాత వారికి బిడ్డ జన్మించబోవడం కూడా రామ్‌చరణ్‌కు డబుల్ ధమాకా సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఉపాసన సిస్టర్స్ అనుష్పాల, సింధూరి ఈ సీమంతం వేడుకను ఏర్పాటు చేశారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రామ్‌చరణ్ దంపతులు బాగా ఎంజాయ్ చేశారు. తన సోదరీమణులకు కృతజ్ఞతలు చెపుతూ వీడియోను షేర్ చేశారు ఉపాసన.  సముద్రపు ఒడ్డున ఉపాసన, రామ్‌చరణ్  ఫొటోలు దిగారు.