సీఎంని కలిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.శ్రీపాల్ రెడ్డి అభినందన కార్యక్రమంలో ఆయన పలువురు మంత్రులతో కలిసి పాల్గొన్నారు. వరంగల్ , ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైన పింగిలి శ్రీపాల్ రెడ్డి ..సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.శ్రీపాల్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఎన్నికలో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.