ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్‌గా కన్వర్ట్ చేసిన యూపీ యువత
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు ఏకంగా ట్రాక్టర్ ట్రాలీని మినీ స్విమ్మింగ్ పూల్‌గా తయారు చేశారు. రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎండలు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఎండలు కాస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రకరకాల ఎత్తులు వేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు ఏకంగా ట్రాక్టర్ ట్రాలీని మినీ స్విమ్మింగ్ పూల్‌గా తయారు చేశారు. నీరు లీక్ కాకుండా దళసరిపాటి ప్లాస్టిక్ పట్టాతో కవర్ చేశారు. అందులో నీళ్లు నింపి చిన్నారులు, కొందరు యువత స్విమ్మింగ్ చేస్తున్నారు.

