Home Page SliderNational

యోగి ఆదిత్యనాథ్‌కు చంపేస్తామనంటూ బెదిరింపులు

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. డేరింగ్, డ్యాషింగ్ సీఎంగా పేరుపొందిన యోగికి ఇలాంటి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఈ బెదిరింపు కాల్స్ 112 అనే నెంబరుకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగం అత్యవసర విభాగానికి ఈ నెంబరు వినియోగిస్తున్నారు. దీనికే ఫోన్ చేసి సీఎంను చంపేస్తామని బెదిరిస్తున్నారంటే ఎంత గుండెధైర్యం కావాలో. దీనితో అప్రమత్తమైన పోలీస్ శాఖ దీనిపై కేసు నమోదు చేసి, రిహాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యోగి సీఎంగా వచ్చినప్పటి నుండి యూపీలో శాంతిభద్రతలు కుదుటపడ్డాయి. నేరస్తులకు సింహస్వహ్నంగా మారారు. ఆయన అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాలలోనే ఇప్పటివరకు 178 మందిని పోలీసులు ఎన్‌కౌంటర్స్‌లో చంపేసారు. ఈమద్యనే జరిగిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అతీక్, అతని సోదరుడు అఫ్రాద్ కూడా మరణించడం సంచలనం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాల్ రావడంతో అందరూ అప్రమత్తమయ్యారు.