అకాల వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కోసం అధికార యంత్రాంగం కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటికీ చాలా చోట్ల దొడ్డు రకం వడ్లకు మిల్లులను ప్రభుత్వం కేటాయించలేదు. కాంటాలు ఉన్నా ధాన్యం మిల్లులకు ఎగుమతి కావడం లేదు. అకాల వర్షాలతో రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైన బాధ పడుతున్న రైతన్నలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.

