Home Page SliderInternational

ఈశతాబ్దం చివరి వరకూ మనమే టాప్..UNO

ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా కలిగిన దేశంగా కొనసాగుతున్న భారత్ ఈ శతాబ్దం చివరి దాకా టాప్ పొజిషన్‌లోనే కొనసాగుతుందని యునైటెడ్ నేషన్స్ తాజా నివేదికలో తెలియజేసింది. మనదేశ జనాభా 2060 నాటికి పూర్తి గరిష్టస్థాయికి చేరుకుని 1.7 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. తర్వాత కాలంలో తగ్గుతూ వచ్చి శతాబ్దం చివరకు 1.5 బిలియన్ల వద్దకు తగ్గుతుందని తెలియజేసింది. రెండవస్థానంలో ఉన్న చైనా దేశ జనాభా 2054 నాటికి 1.21 బిలియన్లకు తగ్గవచ్చని పేర్కొంది. 2100నాటికి మరింతగా తగ్గి కేవలం 633 మిలియన్లకు తగ్గుతుందని తెలిపింది. దీనితో భారత్ ఎప్పుడూ జనాభాలో టాప్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత్ జనాభా 1.45 బిలియన్లు కాగా, చైనా జనాభా 1.41 బిలియన్లు ఉంది.