Home Page SliderInternational

అంతు తెలియని కొత్త వైరస్ – చిలీలో ఎమర్జెన్సీ

దక్షిణ అమెరికాలో చిలీ దేశాన్ని అంతు తెలియని కొత్త వైరస్ వణికిస్తోంది.  ఈ వైరస్ పెరుగుతున్న కారణంగా చిలీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అరుదైన గిలాన్ బరే అనే కొత్త వైరస్ కారణంగా శరీరంలో ఇమ్యూనిటీ దెబ్బతింటోందట. ఇది ఇమ్యూనిటీపై దాడి చేసి, నరాలు, కండరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది ఒక అరుదైన సిండ్రోమ్ వ్యాధి కండరాల బలహీనత కలగడం, మొద్దు బారడం, తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.ఇది కాళ్ల దగ్గర మొదలై శరీరం మొత్తం వ్యాపిస్తుందని, దీనిని నరాల పరీక్ష ద్వారా దీనిని గుర్తించవచ్చన్నారు. ఇది చాలా త్వరగా వ్యాపిస్తుందని, శరీరాన్ని పక్షవాతానికి గురిచేస్తుందని, వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి ఖచ్చితమైన కారణం చెప్పలేమన్నారు. ఈ వైరస్ సోకిన వారు కాళ్లలో, వేళ్లలో మొదటగా స్పర్శ కోల్పోతారని, కాళ్లు నడవలేనంతగా బలహీనమైపోతాయని, చూపులకు వస్తువులు రెండుగా కనిపిస్తుంటాయని, మాట్లాడడానికి, నమలడానికి, మింగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.