Home Page SliderNational

విమానాల బెదిరింపులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

విమానయాన భద్రతే ప్రభుత్యానికి అత్యున్నత ప్రాధాన్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బెదిరింపులకు పాల్పడేవారిని నో ప్లై లిస్ట్ లో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులు మొత్తం బూటకమని తేలిందన్నారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్ ఉందని.. దానినే తమ శాఖ, విమానయాన సంస్థలు అనుసరిస్తోందని వివరించారు. ఇలాంటి బెదిరింపులు వచ్చిన సమయంలో పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ విధివిధానాలను మనం అనుసరించాలని ఆయన వ్యాఖ్యానించారు. బెదిరింపు కాల్స్, సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. దీనిలో ఉగ్రకోణంపై స్పందించేందుకు కేంద్ర మంత్రి నిరాకరించారు.