Home Page SliderNational

విమానటికెట్ల ధరలపై కేంద్రమంత్రి  కీలక వ్యాఖ్యలు

విమానటికెట్ల ధరలపై తాము ఓ కన్నేసి ఉంచామని కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పండుగల సీజన్‌లో విమానధరలు పెరుగుతున్నాయని, తాము అన్ని సంస్థల ధరలను గమనిస్తున్నామన్నారు. ధరల పెంపుపై విమానయాన సంస్థలకు ముందుగానే హెచ్చరికలు పంపామన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే సహించమని ముందుగానే స్పష్టం చేసినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ పండుగల సీజన్‌లో ఇళ్లకు వెళ్లాలని కోరుకుంటారని కాబట్టి ధరలు అధికంగా పెంచకూడదని హెచ్చరించినట్లు తెలిపారు.