Breaking Newshome page sliderHome Page SliderNational

ఫ్లైట్ టికెట్ ధరల నియంత్రణపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ

విమాన టికెట్ ధరల నియంత్రణపై లోక్‌సభలో జరిగిన చర్చకు స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఫ్లైట్ ఛార్జీలపై ప్రభుత్వం ఏడాది మొత్తం నేరుగా నియంత్రణ వహించదని తెలిపారు.

“సాధారణ పరిస్థితుల్లో టికెట్ రేట్లను కంపెనీలే నిర్ణయిస్తాయి. మార్కెట్ సప్లై–డిమాండ్ ఆధారంగా ధరలు మారుతాయి. పండుగలు, సెలవులు, రద్దీ సీజన్లలో ఛార్జీలు పెరగడం సహజం,” అని మంత్రి తెలిపారు. అయితే కోవిడ్–19 వంటి అసాధారణ పరిస్థితులు లేదా ఇటీవలి ఇండిగో సంక్షోభం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే కేంద్రం జోక్యం చేసుకుని ఛార్జీలను నియంత్రించగలమని ఆయన స్పష్టం చేశారు.