Andhra PradeshHome Page Slider

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ఉక్కుశాఖామంత్రి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ఉక్కుశాఖామంత్రి కుమారస్వామి, సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖపట్నానికి రానున్నారు. రేపు ఉదయం స్టీల్‌ప్లాంట్ చూసి, క్షేత్రస్థాయిలో ప్రైవేటీకరణపై విచారణ చేసే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఈ విషయంపై ఉత్కంఠ నెలకొంది. విశాఖకు సొంతగనులు ఉంటే ఎలాంటి నష్టాలు రావని కార్మిక యూనియన్లు చెప్తున్నారు. 2020 నుండి దక్షిణ కొరియాకు ప్రైవేటీకరణ చేయాలనుకుని, నష్టాలలో నడిపించదన్నారు. కానీ నష్టాలు కొత్త కాదని, తిరిగి లాభాల బాట పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటు ఉత్పత్తిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ కూడా హాజరవుతున్నారు. మేనేజ్‌మెంట్‌ స్థాయిలో అవినీతి జరిగిందని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కేంద్రమంత్రితో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కింగ్ మేకర్‌గా ఉందని, రాష్ట్రంలో కూడా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉందని, ఈ పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేసి, గనులు కేటాయించాలని వారు కోరుతున్నారు.