ఎయిమ్స్‌లో చేరిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 63 ఏళ్ల నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎయిమ్స్‌లోని ఓ ప్రైవేట్ వార్డులో ఆమె చేరారు. చికిత్స అనంతరం మంత్రిని ఈ రోజే డిశ్చార్జ్ చేస్తారని సమాచారం.