కేఫ్‌లో చాయ్ తాగిన కేంద్రమంత్రి
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ శుక్రవారం సాయంత్రం చాలా సాదా సీదాగా హిమయత్ నగర్‌లోని నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ బీజేపీ పార్టీ మూసీ బాధితుల తరపున ఇందిరాపార్క్‌లో ధర్నా చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి తదితరులతో కలిసి ఈ కేఫ్‌కు వచ్చారు. ఆ కేఫ్‌లో కూర్చుని మస్కాబన్ తిని, ఛాయ్ తాగారు. కేంద్ర మంత్రి వచ్చిన సంగతి తెలుసుకున్న యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన సాంబార్ రైస్‌ను రుచి చూడాలని కోరారు. అయితే నీలోఫర్ అనే పేరు పెట్టడానికి కారణం అడుగగా, తాను చిన్నప్పుడు నీలోఫర్ ఆసుపత్రిలో 2 రూపాయలకు టీ, బిస్కట్లు అమ్మే ఉద్యోగం చేసేవాడినని అందుకే ఆ పేరు పెట్టానని పేర్కొన్నారు. దీనితో మంత్రి ఆయనను అభినందించారు.