బాలకృష్ణకి కేంద్ర మంత్రి కంగ్రాట్స్
సినీ నటుడు నందమూరి బాలకృష్ణను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఇవాళ ఆయన ఇంటికి వెళ్లి పద్మభూషణ్ అవార్డ్ ప్రకటన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను కిషన్ రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని, క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా నిరుపేదలకు సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రజాసేవలోనూ ముందున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్ ప్రకటించడం సంతోషకరమని చెప్పారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ సమాజానికి స్ఫూర్తిదాయక సినిమాలు తీస్తున్నానని, 15 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా, ప్రజాప్రతినిధిగా చేస్తున్న సేవలను భారత ప్రభుత్వం గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.