కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు
తెలంగాణ: కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర నేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ స్వాగతం పలికారు. షా మొదట చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. తర్వాత కొంగరకలాన్‌లో బీజేపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

