నిరుద్యోగమే పార్లమెంట్‌పై దాడికి కారణం: రాహుల్ గాంధీ
పార్లమెంట్‌పై దాడి జరిగిన సంఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ విధానాలే ఈ దాడికి కారణమని విమర్శించారు. లోక్‌సభలోకి దుండగులు చొరబడే పరిస్థితి ఎందుకొచ్చింది? నిరుద్యోగం వల్లే, ఇది దేశంలో ఇప్పుడు అతిపెద్ద సమస్య. మోడీ పాలసీల వల్ల యువతకు ఉపాధి దొరకట్లేదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే పార్లమెంటుపై దాడికి వెనుకున్న కారణాలు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

