తెలంగాణ ఏర్పాటులో నిరుద్యోగులే కీలకం..రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం నిరుద్యోగులే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రంగారెడ్డిలోని వట్టినాగులపల్లిలో అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పెరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు. ప్రజల ఆలోచనలే తమకు ముఖ్యమని, ప్రజలు కోరింది చేయడమే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. నిరుద్యోగాన్ని రాష్ట్రం నుండి తొలగిస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. 90 రోజుల వ్యవధిలో 30 వేల ఉద్యోగాలు కల్పించామని, త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.


 
							 
							