Home Page SliderTelangana

జీహెచ్ఎంసీలో ఆకస్మిక తనిఖీలు

జీహెచ్ఎంసీలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. జోనల్ కమిషనర్ లతో కలిసి జూబ్లీ హిల్స్ రోడ్ నం.45, రోడ్ నం.70, గౌతం నగర్ బస్తీ, దీన్ దయాళ్ నగర బస్తీ, ఫిల్మ్ నగర్, పీఈటీ పార్క్ ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో తరచూ చెత్త వేసే ప్రాంతాల (జీవీపీ) పరిశీలించారు. చెత్త ఎక్కువ ఉత్నమయ్యే ప్రాంతాల్లో రెండు షిఫ్టుల్లో చెత్త సేకరణకు ఆదేశాలు జారీ చేశారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్మించే తలపెట్టిన వాన నీటి నిల్వ సంపుల నిర్మాణ పనుల పరిశీలన చేశారు. జర్నలిస్టు కాలనీలోని పాలపిట్ట సర్కిల్ పరిసర ప్రాంతాల్లో తిరిగి రహదారులపై ఉన్న ప్యాచ్ వర్క్స్ చేయకుండా వదిలేసిన గుంతలను పరిశీలించి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్షం కాలంలో అంటు వ్యాధులు ప్రబలించే అవకాశం ఉన్నందున.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గార్బేజీ వనరబుల్ పాయింట్లపై (తరచూ చెత్త వేసే ప్రాంతాలు) ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

అనంతరం SFA పారిశుధ్య కార్మికులతో సమావేశం అయి వారి సమస్యలు తెలుసుకున్నారు. పని వేళల్లో కార్మికులు తప్పనిసరిగా యూనిఫాం, హ్యాండ్ గ్లౌజ్ ధరించి.. రక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం.. పలు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న నీటి నిల్వ సంపుల పనుల్ని పరిశీలించారు. వర్షాకాలంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం వాటర్ లాగింగ్ పాయింట్లలో సంపుల నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. మొత్తం 140 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండగా.. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అనువైన స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగాఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో రూ. 20 కోట్లతో మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులు నిర్మిస్తారు. వర్షం కురిసే సమయంలో ఈ సంపుల్లో నీటిని సేకరించి.. అనంతరం సమీపంలో ఉన్న నాలాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం వీటి పనులు వేగంగా నడుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఈఈ విజయ్ కుమార్, జలమండలి జీఎం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.