పెయిన్ కిల్లర్స్‌తో అల్సర్ ముప్పు
కీళ్ల నొప్పులు, ఇతరత్రా నొప్పుల కోసం వాడే పెయిన్ కిల్లర్ మందులతో అల్సర్ ముప్పు ఏర్పడనున్నట్లు తాజా పరిశోధనలలో తెలిసింది. ‘ఐబూప్రొఫెన్, డ్రైక్లోఫెనాక్’ వంటి NSAID రకం నొప్పి మాత్రలను దీర్ఘకాలంగా వాడినవారిలో జీర్ణకోశం దెబ్బతింటుందని పరిశోధకులు తేల్చారు. ఇలాంటి మందులను ఆరు నెలల కంటే ఎక్కువ కాలం వాడిన వారిలో 65 శాతానికి పైగా జీర్ణకోశం దెబ్బతిందని, 15 శాతం మందికి పుండ్లు పడినట్లు అయ్యిందని అధ్యయనంలో తేలింది. వీటి వలన పేగులు గోడలు ఉబ్బి, జీర్ణాశయం వంటి వాటిని దెబ్బతీస్తాయి. ఈ మందులు హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. కడుపులోకి వెళ్లిన తర్వాత వాపు కారక కణాలను విడుదల చేస్తాయి. ఇవి జీర్ణకోశ వ్యవస్థ గోడలకు అంటుకుని దెబ్బతీస్తాయి. ఈ బాక్టీరియా వల్ల సుమారు 17 రకాల అల్సర్లు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

