ఎన్టీఆర్‌కు యూకే ఫ్యాన్స్ బర్తడే గిఫ్ట్
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న జరుగబోతోంది. పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యూకేలోని అతని అభిమానులు వినూత్నంగా బర్తడే విషెస్ తెలియజేశారు. 30 అడుగుల ఎయిర్ బ్యానర్‌ను విమానంతో గాలిలో ఎగరేస్తూ హ్యాపీ బర్తడే ఎన్టీఆర్ అంటూ సందడి చేశారు. దీనిని ట్విటర్‌లో షేర్ చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి సినిమాను ఆయన బర్తడే సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు. భారీ ఎత్తున కటౌట్లు పెట్టి, సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వీరాభిమాని అయిన హీరో విశ్వక్సేన్ హాజరై సందడి చేశారు. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు అయ్యిందని, ఐనా ఇంకా రీరిలీజ్ సందర్భంగా 1000 స్కీన్స్ ఏర్పాటు చేశారని గొప్పగా చెప్పారు.