Breaking NewsHome Page SliderPoliticsSpiritual

27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్న‌ట్లు ఆల‌య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.తిరుమ‌ల తొక్కిస‌లాట నేప‌థ్యంలో అలాంటి భ‌యాన‌క ప‌రిస్థితితులు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆల‌య ఈవో సిబ్బందిని ఆదేశించారు.ఈ విష‌యంలో పోలీసుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు అన్నీ విధాలుగా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోరారు.