ఉడాన్ సే…ఉడో!
ఉడాన్ పథకం కింద అదనంగా 120 మార్గాల్లో విమాన సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్న విమానాశ్రయాల నుంచి వాణిజ్య కార్యకలాపాలను పెంచేందుకు ‘ఉడాన్’ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆయా విమానాశ్రయాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అక్కడి నుంచి సర్వీసులు పెంచేలా కేంద్రం వీజీఎఫ్(వయబిలిటీ గ్యాప్ ఫండింగ్)ను అందిస్తుంది. నిబంధనల మేరకు.. కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి మాత్రమే ఉడాన్ సర్వీసులు నడిపే అవకాశం ఉంది. అదనపు సర్వీసుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) పౌర విమానయాన సంస్థకు ప్రతిపాదనలను పంపింది. వాటిలో కర్నూలు-విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైకి, కడప- విజయవాడ, హైదరాబాద్, చెన్నై సర్వీసుల ప్రతిపాదనలున్నాయి.