Home Page SliderNational

దేవేంద్ర ఫడ్నవీస్ తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి అమిత్ షా ముంబై వస్తున్న వేళ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరి భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరగలేదని తెలుస్తోంది. అయితే ఇరువురి నేతల మధ్య ముఖ్యమైన అంశంపై భేటీ జరిగిందనే వాదనలను శివసేన నేత సంజయ్ రౌత్ కొట్టి పారేశారు.