Andhra PradeshHome Page Slider

ప్లీడర్ల టూ వీలర్ల ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ అమలు చేస్తున్న వెల్ఫేర్ నిబంధనలు సడలించాలని కైకలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాడెం వెంకట సత్యనారాయణ కోరారు.

కైకలూరు: ఏపీ బార్ అసోసియేషన్ అమలు చేస్తున్న వెల్ఫేర్ నిబంధనలు సడలించాలని కైకలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాడెం వెంకట సత్యనారాయణ కోరారు. సీనియర్ అడ్వొకేట్లతో పాటు కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లీడర్లకు కూడా సంక్షేమ ఫలాలు సమానంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తాలూకా కూడలి నుంచి ఏలూరు రోడ్డు వరకూ అడ్వొకేట్లు టూ వీలర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వయోపరిమితి లేకుండా సంక్షేమ కార్యక్రమాల్లో చోటు కల్పించాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని కోరారు. అడ్వొకేట్లు ఎంఎస్ఎస్ రాజు, బి.లక్ష్మరావు, చావలి శంకర శాస్త్రి, ఎండీ రజిమున్నీసా, రమాదేవి, ఇందిర, రాంబాబు, దేవరపల్లి శివప్రసాద్, గంగాధరరావు, కోటయ్య, గాలిబ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.