Andhra PradeshHome Page Slider

ఆర్కే బీచ్‌లో ఈతలు కొడుతూ మునిగిపోయిన ఇద్దరు విద్యార్థులు

విశాఖ: నగరంలో ఆర్కే బీచ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరిలో హర్ష అనే యువకుడి మృతదేహం దొరికింది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నారై కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న యువకులు.. ఇవాళ ఉదయం బీచ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.