వైద్యరంగంలో ఇద్దరికి దక్కిన నోబెల్ ప్రైజ్
వైద్యశాస్త్రానికి ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఇద్దరిని వరించింది. 2024 వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు దక్కినట్లు నోబెల్ బృందం ప్రకటించింది. వీరికి మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఆవిష్కరణ, పోస్ట్ ట్రాన్‌స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్ర గురించి చేసిన పరిశోధనలకు ఈ బహుమతి ప్రకటించారు. స్వీడన్‌లోని స్కాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఈ విషయం తెలియజేసింది