రెండు ఎమ్మెల్సీలు కమలం కైవసం
తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటింది.రెండు స్థానాలను ఎగురేసుకుపోయింది.గట్టిపోటీ ఇస్తారనుకున్న కాంగ్రెస్ ,బీ.ఆర్.ఎస్. పార్టీలు చతికిలపడ్డాయి.రూలింగ్ పార్టీకి ఇది గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి.సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల విధానాలు కూడా తాజా ఎన్నికల్లో ఘోర పరాభవానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్లు నిన్నటి నుంచి బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఫలితాలకు ఒక రోజు ముందు నుంచి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లు రేవంత్ రూలింగ్ ని తప్పుబడుతూ వచ్చారు.కాగా బీజెపి రెండు స్థానాలను కైవసం చేసుకోవడంతో ఇక రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం పార్టీయే అధికారంలోకి రాబోతుందన్న సంబరంలో మునిగిపోయారు.ఈ మేరకు గురువారం స్టేట్ బీజెపి కార్యాలయంలో సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.