బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?
తెలంగాణ: బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేల కోసం రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. మరికొందరు హస్తం గూటికి చేరిన తర్వాత వారందరిలో ఇద్దరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. పోచారం శ్రీనివాస్ కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.