క్యాంటీన్‌లో అమ్మాయిల డిష్యూం..డిష్యూం
కాలేజీ అన్నాక గొడవలు సహజంగా జరుగుతుంటాయి. దీనితో ఎక్కువ శాతం అబ్బాయిలు ఉండటం సర్వ సాధారణమైన విషయమే. కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలు , అమ్మాయిలు అనే తేడా లేకుండా చిన్న సమస్యకి కూడా చెంపలు పగలగొట్టుకునే వరకు వెళ్తున్నారు. ఈ తరహాలో సోషల్ మీడియాలో అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలియకుండా కాలేజీ క్యాంటీన్‌లో అందరు ఉన్న సమయంలోనే ఇద్దరు యువతులు కొట్టుకుంటున్నా వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే ఎడమవైపు ఉన్న అమ్మాయి కుడివైపు ఉన్న అమ్మాయి చెంప పగలకొట్టింది. దీంతో ఎదురు తిరిగిన అమ్మాయి కూడా తగిన విధంగా బుద్దిచెప్పింది. అంతే.. దీంతో అక్కడ ఓ రణరంగమే మొదలైంది. అక్కడ ఉన్న వారు కూడా వారిని ఆపాల్సింది పోయి చప్పట్లు కొడుతూ ఆస్వాదించారు. అయితే ఈ ఘటన బెంగళూరు దయానంద సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంటీన్‌లో చోటుచేసుకున్నట్టు సమాచారం.


 
							 
							