కేరళలో రెండు రోజులు సంతాప దినాలు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించడంతో దాదాపు 100 మంది మృతి చెందారు. ఈ ఘటనతో దేశం మొత్తం చలించిపోయింది. దీనితో కేరళలో మంగళవారం, బుధవారం రెండు రోజులను సంతాపదినాలుగా ప్రకటించారు. ఈ ఘటనలో ఇంకా అనేక మంది బురదలో కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మట్టి పెళ్లల కింద, వాగుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడి తేయాకు, యాలకుల తోటలలో వందల మంది శ్రామికులు గల్లంతయినట్లు సమాచారం. సైన్యం, సీఆర్‌పీఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.