Home Page SliderTelanganatelangana,

వివాహానికి రెండున్నర లక్షల ప్రభుత్వం సహాయం…

వివాహం చేసుకుంటే రెండున్నర లక్షలు బహుమతి. ఇదేదో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్ కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్కీమ్‌కు వివాహం చేసుకునే వారందరూ అర్హులు కాదు. ఒకే ఒక్క కండిషన్. అదేటంటే కులాంతర వివాహమై ఉండాలి. అది కూడా వధూవరులలో ఒకరు ఎస్సీ అయి ఉండాలి. వారిద్దరూ తెలంగాణ వాసులై ఉండాలి.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి వయసు అమ్మాయికి 18, అబ్బాయికి 21 నిండి ఉండాలి. రెండవ వివాహమై ఉండకూడదు. వివాహమైన ఏడాది లోపు దరకాస్తు చేసుకున్నవారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. రాష్ట్రప్రభుత్వం ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే పేరుతో ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.