Home Page SliderTelangana

ప్రియురాలి భర్తపై కాల్పులు జరిపిన టీవీ యాక్టర్

హైదరాబాద్‌లోని శామిర్ పేటలో టీవీ యాక్టర్ మనోజ్ నాయుడు అనే వ్యక్తి , సిద్దార్థ దాస్ అనే వ్యక్తిపై కాల్పులకు పాల్పడ్డాడు. శామిర్ పేటలోని సెలబ్రిటీ క్లబ్‌కు తన ప్రియురాలితో కలిసి వచ్చిన మనోజ్ నాయుడుని ఆమె భర్త సిద్దార్థ్ దాస్ చూశారు. వీరిద్దరిని గమనించిన అతడు ప్రశ్నించడంతో తనవద్ద ఉన్న ఎయిర్ గన్‌తో సిద్ధార్థ్ దాస్‌పై కాల్పులు జరిపారు మనోజ్ నాయుడు.  డయల్ 100కు ఫోన్ చేసిన సిద్ధార్థ్, అనంతరం శామిర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. దీనితో పోలీసులు మనోజ్ నాయుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. సిద్ధార్థ్ దాస్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మనోజ్ నాయుడు మౌనపోరాటం వంటి సీరియల్స్‌లో హీరోగా నటించారు. సిద్ధార్థ్ భార్యతో మనోజ్‌కు గల వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంలోనే వారిమధ్య వాగ్వాదం జరిగిందని చెప్తున్నారు.