భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన టర్కీ
వందలసార్లు భూప్రకంపనలతో వణికిపోయిన టర్కీ, సిరియాలకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తాన్ని అందించిన సంగతి మనకు తెలిసిందే. భారత్ కూడా వెంటనే స్పందించి సహాయచర్యలకు నిధులను, వైద్యసిబ్బందిని పంపించింది. రెండు భారత్ ఎన్డీఎఫ్ బృందాలు టర్కీ, సిరియాలకు పంపించారు. ఈ సహాయానికి టర్కీ కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ టర్కిష్ భాషలో దోస్త్ కారా గుండె బెల్లి ఒలూర్ (ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు) అని ట్విట్టర్‌లో అన్నాడు.

విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తరపున రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ప్రభుత్వ సమన్వయంతో ఎన్డీఆర్‌ఎఫ్ వైద్య బృందాలను, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లతో పాటు రిలీఫ్ మెటీరియల్‌ను టర్కీకి పంపాలని నిర్ణయించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. కేబినెట్ సెక్రటరీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ , రక్షణ దళాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. వీరి సమావేశంలో అవసరమైన పరికరాలు, సుమారు 100 మంది బృందాలను భూకంపం సంభవించిన ప్రాంతాలకు పంపడానికి నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని బృందాలు వైద్యసామాగ్రి, మందులతో టర్కీలోని డెమాస్కస్‌కు చేరుకున్నాయని తెలియజేశారు.