Home Page SliderTelangana

తుమ్మల మలేషియా టూర్

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనకు వెళ్లారు. ఆయిల్ ఫామ్ సాగు విధానం, నూనె గింజల ఉత్ప త్తి…తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి మలేషియా బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆయిల్ ఫామ్ ప్రాజెక్టును మరింత విజయవంతం చేయటానికి గాను తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధ్యయనం చేయనున్నారు. మంత్రి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, అధికారులు సరోజిని, ఓఎస్టీ శ్రీధర్ ఉన్నారు.